ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను రాజీనామా చేస్తానని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని బెదిరించినట్లు చెబుతున్నారు. పాలనాయంత్రాంగం స్తంభించిన నేపథ్యంలో ఆయన శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి తాను తప్పుకుంటానని చెవిలో వేశారట. తాను డమ్మీగా మారిపోయానని, తాను తీసుకున్న నిర్ణయాలేవీ అమలు కావడం లేదని, అధికారులు అసలు పట్టించుకోవడం లేదని ఆయన గొంతు చించుకున్నట్లు వినికిడి.
మంత్రి మాట అసలు చెల్లుబాటు కావడం లేదట. పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ సూచన మేరకు వరంగల్ వైద్య, ఆరోగ్య అధికారిగా ఒకరిని వేయాలని తాను చెప్తే మరో అధికారిని వేసి ఉన్నతాధికారులు డిఎల్‌ను అవమానించారు.
Claiming that the state administration has virtually collapsed, health minister D L Ravindra Reddy met chief minister N Kiran Kumar Reddy on Friday and threatened to resign from the cabinet.