దీపికా పడుకొనే కోసమే యువీ?

ఏడు మ్యాచులు ఆడి నాలుగు సార్లు యువీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా నిలిచాడు. నిజానికి, ఒక సందర్భంలో భారత జట్టులో అతని స్థానమే సందేహంగా మారింది. అటువంటి సందర్భంలో ఒక్కసారిగా యువీ లేకపోతే భారత జట్టు ఇక్కడి దాకా వచ్చేదే కాదని అనిపిస్తున్నాడు. అతనికి స్ఫూర్తినందిస్తున్నది అతని తల్లిదండ్రులా అనే కోణంలో కూడా ఆలోచన సాగుతోంది. అయితే, బాలీవుడ్ అందాల భామ దీపికా పడుకొనే అతనికి స్ఫూర్తినిస్తుండవచ్చుననే ప్రచారం సాగుతోంది. కానీ, అది నిజం కాదని కూడా అంటున్నారు. అతన్ని దారిలో పెట్టింది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అని అంటున్నారు. ఈ వాస్తవం బయటపడాలంటే భారత్ పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్లో గెలిచి, ఆ తర్వాత ఫైనల్లో విజయ ఢంకా మోగించి కప్ అందుకునే దాకా ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications