జగన్‌కు రాజశేఖర్ దూరమయ్యాడా?

Rajasekhar
వచ్చీ రానీ తెలుగు భాషలో ప్రత్యర్థులపై, ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వచ్చిన తెలుగు సినీ హీరో రాజశేఖర్ ఇటీవలి కాలంలో నోరు మెదపడం లేదు. చిరంజీవి రక్తనిధిపై భార్య జీవితతో కలిసి రాజశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ వెంట నడిచేందుకు ఈ సినీ దంపతులు సిద్ధపడ్డారు. విజయవాడలో చేపట్టిన వైయస్ జగన్ దీక్షకు వీరిద్దరూ హాజరయ్యారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నవాళ్లలో వీరిద్దరు అతి ముఖ్యులు.

చిరంజీవికి పోటీగా వైయస్ జగన్ శిబిరింలో బహుశా, వారిద్దరు ఒక వెలుగు వెలగాలని చూసినట్లే ఉన్నారు. కానీ, తదనంతర కాలంలో వైయస్ జగన్ కార్యక్రమాల్లో వారి జాడ కనిపించడం లేదు. పులివెందులలో వైయస్సార్ కాంగ్రెసు జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా వారు హాజరు కాలేదు. జగన్‌తో లాభం లేదని భావించారా, అందుకే జగన్‌కు దూరమయ్యారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+