బాబును వెనకేసుకొచ్చిన జగన్ 'సాక్షి'

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై నోరెత్తకున్నా కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కెసిఆర్ పల్లెత్తు మాట అనడం లేదని చెప్పడానికి చంద్రబాబును సాక్షి వెనకేసుకొచ్చింది. రాష్ట్రం ఇచ్చేందుకు, అడ్డుకునేందుకూ ఏ శక్తీ లేని టిడిపి, రాష్ట్ర కాంగ్రెసు నేతలపై మాత్రం ఒంటి కాలి మీద లేవడం కెసిఆర్‌కు అలవాటైందని ఆడిపోసుకుంది. ఇందులో కొసమెరుపు ఏమిటంటే, తెలంగాణపై గోడ మీది పిల్లి వాటం తీసుకున్న వైయస్ జగన్‌ను ఏమీ అనకూడదనే సందేశంలాంటి సూచన ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications