నాగం జనార్దన్ రెడ్డి వెనక జైపాల్ రెడ్డి?

ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి వెంట తమ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు ఎవరూ లేరని చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అయితే, పోచారం శ్రీనివాస రెడ్డి ఇప్పటికే పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. మరికొంత మంది కూడా చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదలా ఉంచితే, నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెసు వర్కింగ్ కమిటీలోని ఓ సభ్యుడితో సన్నిహితంగా ఉంటున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ విధమైన వ్యాఖ్యల ద్వారా నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెసుకు దగ్గరవుతున్నారని అనిపించదడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications