కిరణ్ రెడ్డిపై జెసి ప్రతీకారం తీర్చుకుంటారా?

పైగా, తమ ప్రత్యర్థులు రఘువీరా రెడ్డి, శైలజానాథ్ మాత్రం మంత్రులుగా కొనసాగుతున్నారు. దీంతో కాంగ్రెసుకు అనంతపురం జిల్లాలో తగిన బుద్ధి చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నారట. అట్లని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ వైపు పోతారని కాదు. కాంగ్రెసులోనే ఆయన ఉండదలుచుకున్నారు. కానీ వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థులకు ఏ మాత్రం సహకరించకూడదని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన తన అల్లుడు దీపక్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి పంపించారని అంటున్నారు. అయితే, దీపక్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం వెనక తన ప్రమేయం ఏమీ లేదని ఆయన ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉన్నారు. కానీ, తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల పార్టీకి కలిగే నష్టమేమిటో చెప్పదలుచుకుంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications