వైయస్ జగన్‌పై కొండా సురేఖ అలక?

Konda Surekha
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు శానససభ్యురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అలిగినట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం సాయంత్రం వైయస్ జగన్ ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశానికి అందుకే ఆమె డుమ్మా కొట్టినట్లు చెబుతున్నారు. మొదటి నుంచీ కాంగ్రెసు అధిష్టానంపై నిప్పులు చెరుగుతూ వైయస్ జగన్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. వైయస్ జగన్ కోసం ఆమె మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. ఇంత త్యాగం చేసిన తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆమె అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

సమావేశానికి రావాలని గురువారం పార్టీ నాయకుడు వైవి సుబ్బా రెడ్డి సురేఖకు ఫోన్ చేశారట. అయినా, ఆమె పట్టించుకోలేదని అంటున్నారు. పార్టీ కమిటీల్లో తనకు స్థానం కల్పించకపోవడంపై సురేఖ అలక వహించినట్లు చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీసుకునే చర్యలకు తాను సిద్ధపడిన తర్వాత కూడా తనకు తగిన స్థానం కలిగించకపోవడంలోని ఆంతర్యమేమిటని ఆమె నొచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు. తన వెంట నడుస్తున్న శాసనసభ్యల విషయంలో వైయస్ జగన్ అంతరంగం ఏమిటో ఎవరికీ అంతు పట్టడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+