సినీ నటి రంజితపై స్వామి నిత్యానంద మాజీ శిష్యుడు లెనిన్ మనసు పడ్డాడా? అవునంటోంది రంజిత. రంజితపై మనసు పడిన లెనిన్ కక్ష కొద్దీ స్వామి నిత్యానందతో శృంగార లీలలు నడిపినట్లు తప్పుడు వీడియో టేపులను బయటపెట్టాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆ ఆరోపణలను లెనిన్ కొట్టిపారేస్తున్నాడు. తాను రంజితపై మనసు పడ్డాననే ఆరోపణల్లో నిజం లేదని అతను ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. నటి రంజితతో శృంగార కార్యకలాపాల్లో పాల్గొంటూ మీడియా కంటికి అడ్డంగా దొరికిన స్వామీ నిత్యానంద 'లీలలు' ఇంకా బోలెడన్ని వున్నాయని ఆయన మాజీ శిష్యుడు లెనిన్ చెప్పాడు. నిత్యానంద గదిలో దృశ్యాలను తాను చిత్రీకరించలేదని, ఎవరో తీసిన సీడీ తనకు దొరికిందని తెలిపారు. అలాంటి సీడీలు ఇంకా చాలా వున్నాయని చెప్పారు. పోలీసులకిచ్చిన ఫిర్యాదును వాపసు తీసుకుంటే రూ.20 కోట్లు ఇస్తామని, లేకుంటే హత్య చేస్తామంటూ కొందరు బెదిరించారన్నారు.