మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేష్ ప్రతీకారం తీర్చుకున్నారు. తన స్టూడియోఎన్ టీవీ చానెల్‌లో వైయస్ జగన్‌పై ఆరోపణాస్త్రాలు సంధిస్తూ లోకేష్ ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఏడు రోజుల పాటు దీక్ష చేసిన వైయస్ జగన్ అంత ఆరోగ్యంగా ఉండడమేమిటని, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని, జగన్ ఆరోగ్య రహస్యమేమిటని ప్రశ్నిస్తూ ఆ చానెల్ ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన వైయస్ జగన్ దీక్ష ముగించిన తర్వాత ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతూ ధాటిగా ప్రసంగించారు. ఏడు రోజుల పాటు దీక్ష చేసిన జగన్ అంత దాటిగా మాట్లాడే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని చానెల్ ప్రశ్నించింది. దీక్షకు వచ్చినవారికి డబ్బులు పంపిణీ చేశారని, దాంతో వారు మద్యం కొనుక్కుని సేవించారని ఆరోపిస్తూ మద్యం కొంటున్న దృశ్యాలను స్టూడియోఎన్ ప్రసారం చేసింది. గతంలో చంద్రబాబు రైతు సమస్యలపై దీక్ష చేసినప్పుడు ఇదే విధమైన వార్తాకథనాన్ని జగన్‌కు చెందిన సాక్షి టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. చంద్రబాబు దీక్షపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, చంద్రబాబు ఆరోగ్య రహస్యమేమిటంటూ ప్రశ్నించింది. నీవు నేర్పిన విద్యయే అంటూ లోకేష్ జగన్ దారినే ఎంచుకున్నారు.
TDP president Chandrababu's son Nara Lokesh adopted same strategy of YS Jagan to counter the later. Nara Lokesh TV channel studio N telecasted a report question YS Jagan's fast. He suspected the genuinity of YS Jagan's 7 days fast.