మద్దెలచెర్వు సూరి హత్యలో ఓ కొత్త పాత్ర ప్రవేశించింది. సూరి హత్యలో బాబు అనే వ్యక్తి ప్రధాన పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. పరిటాల రవికి ప్రైవేట్ సైన్యంగా పనిచేసిన ఆర్వోసిలో బాబు పనిచేశాడట. అతను ప్రస్తుతం జైల్లో ఉన్న పరిటాల రవి ముఖ్య అనుచరుడు పోతుల సురేష్‌కు బాబు కుడి భుజంలాంటివాడట. బాబుకు, సూరి ముఖ్య అనుచరుడిగా పనిచేస్తూ వచ్చిన భాను కిరణ్‌కు మధ్య 15 పరిచయం ఉందని సమాచారం. 1999లో పరిటాల రవి కిడ్నాప్ చేసినప్పుడు భాను కిరణ్‌ను కాపాడింది కూడా బాబేనని అంటారు. ఆ పరిచయాన్ని ఆసరా చేసుకుని భాను కిరణ్ ద్వారా సూరిని ఖతం చేయడానికి పోతుల సురేష్ పథకం రచించాడని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సూరికి, భానుకు మధ్య తలెత్తిన విభేదాలను వాడుకుని పరిటాల అనుచరులు తమ పని పూర్తి చేశారని ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య కాలంలో భాను బాబును కలిసి సూరి తనను వేధిస్తున్నాడంటూ మొర పెట్టుకుని తనకు సహకరిస్తే సూరిని అంతం చేస్తానని చెప్పాడట. ఆ మేరకు సూరి హత్యకు బెల్గాం సుపారీలను కుదిర్చినట్లు చెబుతున్నారు.