విలీనంపై సందిగ్ధంలో చిరంజీవి?

అయితే సోనియా గాంధీ అనుకోకుండా శస్త్ర చికిత్స కోసం విదేశాలకు వెళ్లడంతో మరోసారి విలీనంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సోనియా ఉండి ఉంటే ఈ నెల 8 నుండి 10 మధ్య సభ్యత్వ ప్రక్రియ పూర్తయ్యేది. సోనియా శస్త్ర చికిత్స అనంతరం 3 వారాల పాటు అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో మరో నెల రోజుల పాటు ఆగాల్సి ఉంటుంది. అలా ఆగాలా? లేదా సోనియా తాను వెళ్లే ముందు కేర్ టేకర్ కమిటీని నియమించినందున ఆ కమిటీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోవాలా? అనే మీమాంసలో ఇటు చిరు వర్గాలు, అటు కాంగ్రెసు వర్గాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. శుక్రవారం పిసిసి చీఫ్ బొత్సతో చిరు భేటీ అయి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా కేర్ టేకర్ కమిటీలో రాహుల్ గాంధీ ఉన్న కారణంగా సోనియా వచ్చే వరకు ఆగాల్సిన ఆవశ్యకత లేదని పలువురు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications