వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పద్మశ్రీ జోక్, ఐఎఎస్ రాజగోపాల్ సీరియస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajagopal
తీవ్రమైన చిక్కుల్లో ఉన్నప్పుడు మానసిక స్థితి కూడా చేయి దాటిపోతుందంటారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ఐఎఎస్ అధికారి రాజగోపాల్ మాటలు చూస్తే నవ్వు రాకతప్పదు. నిజానికి, సిబిఐ అధికారులు కూడా బిగ్గరగా నవ్వేశారట. రాష్ట్రంలో గనుల ముఖచిత్రమంతా మార్చేసినందుకు తనకు పద్మశ్రీ ఇవ్వాలి గానీ ప్రాసిక్యూట్ చేయకూడదని రాజగోపాల్ గారు అనేశారని అంటున్నారు. రాజగోపాల్ మాట్లాడుతున్నదేమిటో తెలియక కాసేపు సిబిఐ అధికారులు నివ్వెరపోయినా, ఆ తర్వాత పగలబడి నవ్వేశారని వార్తలు వచ్చాయి.

అయితే, రాజగోపాల్ మాత్రం సీరియస్‌గానే తనకు పద్మశ్రీ రావాలని నమ్ముతున్నట్లు మాట్లాడారట. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ రెవెన్యూ తన హయాంలో 300 కోట్ల రూపాయలకు పెరిగిందని, అదంతా తన సత్తానే అని ఆయనగారు చెప్పుకున్నారట. క్యాప్టివ్ మైన్స్ అనే పదం జివో నుంచి ఎలా ఎగిరిపోయిందంటే మాత్రం ఆ తప్పు తనది కాదని చెప్పేశారట. పెద్దవాళ్ల ఒత్తిడితోనే అది జరిగిందని నెపం ఇతరుల మీదికి నెట్టేశారట. గాలి జనార్దన్ రెడ్డికి బ్రాహ్మణి స్టీల్స్‌కు వాడుకోవడానికి మాత్రమే గనులను లీజుకు ఇవ్వాల్సింది. అయితే, జీవోలో కాప్టివ్ అనే పదం వాడకపోవడం వల్ల, ఆ పదాన్ని తొలగించడం వల్ల గాలి జనార్దన్ రెడ్డి ఇష్టారాజ్యంగా ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసుకోవడానికి వీలు కలిగింది. రాజగోపాల్ గానీ, మరో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి గానీ దొరికిపోతున్నది ఇక్కడేనని అంటున్నారు.

English summary
CBI officials were taken aback recently when former mines officer V.D. Rajagopal, arrested for his alleged role in the Gali Janardhan Reddy’s Obulapuram mining scam, told them with a straight face that instead of being prosecuted, he should be awarded a Padma Shri as he had changed the face of mining in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X