తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ డిఎంకె అధినేత కరుణానిధికి ఓదార్పు మాటలు చెప్పారు. తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న కరుణానిధిని సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చిన తర్వాత రజనీకాంత్ ఫోన్ చేసి పలకరించారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. 2జి స్కామ్ కేసులో ఇరుక్కుని జైలు పాలైన కరుణానిధి కూతురు కనిమొళి గురించి కూడా అడిగి తెలుసుకున్నారట. కష్టాలు తీరిపోతాయని రజనీకాంత్ కరుణానిధితో ధైర్యవచనాలు పలికారని చెబుతున్నారు.
శాసనసభ ఎన్నికల సమయంలో అన్నాడియంకె నేత జయలలితకు పూర్తి మద్దతిచ్చిన రజనీకాంత్ ఇప్పుడు కరుణానిధితోనూ మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు. అటు జయలలితతో ఇటు కరుణానిధితో ఆయన దగ్గరగానే వ్యవహరిస్తున్నారు.