శిథిలావస్థలో రజనీకాంత్ స్కూల్

Rajinikanth
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చదువుకున్న ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉంది. అయితే, రజనీకాంత్ చూస్తూ ఏమీ ఊరుకోలేదు. పాఠశాల మరమ్మతులకు తాను 25 లక్షల రూపాయలు ఇస్తానని ముందుకు వచ్చారు. రజనీకాంత్ చదువుకున్న గవిపురం ప్రభుత్వ కన్నడ ఆదర్శ ప్రాథమిక పాఠశాల కెంపె గౌడ నగర్‌లో ఉంది. ఆ పాఠశాల ప్రస్తుతం జీర్ణావస్థలో కొట్టుమిట్టాడుతోంది. పాఠశాల కొత్త భవన నిర్మాణానికి 86 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అయితే, ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. దీంతో భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.

ప్రస్తుతం పాఠశాలలో 300 మంది పిల్లలు చదువుతున్నారు. 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలోని పాఠశాల గోడలను కూలిపోయే స్థితిలో ఉన్నాయి. పాఠశాల గదులకు విద్యుత్ సౌకర్యం లేదు. అయితే భవన నిర్మాణ పనులు ప్రారంభమైతేనే రజనీకాంత్ అందించే 25 లక్షల రూపాయలు చేరుతాయి. ఈ పాఠశాలలో రజనీకాంత్ 1954 నుంచి 1959 వరకు చదివారు. తాను చదివిన పాఠశాలపై ప్రేమతో రజనీకాంత్ ఇస్తానన్న సహాయాన్ని కూడా వాడుకోలేని స్థితిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+