ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కీలక నేత అవుతున్నట్లే ఉన్నారు. శాసనసభలో గవర్నర్ కుర్చీని లాగి సస్పెండ్ అయిన తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి మంగళవారం చిరంజీవిని కలిశారు. ఈ భేటీలోని ఆంతర్యం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. సమైక్యవాది అయిన చిరంజీవిని కరుడు గట్టిన తెలంగాణవాది రేవంత్ రెడ్డి ఎందుకు కలిశారనేది ప్రస్తుతం తలెత్తుతున్న సమస్య. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవటంతో అలా ప్రవర్తించినట్లు రేవంత్ రెడ్డి వివరించారు.
తెలంగాణపై ఎవరు పుస్తకం రాసినా తనపేరు ప్రముఖంగా ఉండాల్సిందేనని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 'నేను-నా తెలంగాణ' పేరుతో నాగం జనార్దన్‌రెడ్డి, 'మేము-మా తెలంగాణ' పేరుతో ఎమ్మెల్యే రాములు పుస్తకాలు రాస్తున్నారట కదా? అని విలేకరులు రేవంత్‌ని పలకరించగా ఆయన పై విధంగా బదులిచ్చారు. గవర్నర్ కుర్చీని లాగటం ద్వారా తెలుగుదేశం తెలంగాణ ఫోరానికి గుర్తింపు తీసుకొచ్చానని రేవంత్ ఆయన అన్నారు.
Telugudesam Telangana region MLA Revanth Reddy met Prajarajyam president Chiranjeevi on tuesday. The meeting was discussed in political circles. Revanth Reddy clarified on his behaviour in Assembly during Governor's speech.
Story first published: Wednesday, February 23, 2011, 9:06 [IST]