హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన అమ్మాయి షెర్లిన్ చోప్రా తన నగ్న ఫోజులను నెట్‌లో పెడుతూ సంచలనం సృష్టించింది. హాట్ హాట్ నటిగా పేరు తెచ్చుకున్న నటీమణి షెర్లిన్ చోప్రా తన న్యూడ్ ఫొటోలను నెట్‌లో పెడుతూ వచ్చింది. షెర్లిన్ చోప్రాగా పిలిచే మోనాచోప్రా 1984లో హైదరాబాద్‌లో పుట్టింది. స్థానిక స్టాన్లీ బాలికల పాఠశాలలో చదివింది. చదువు పట్టుబడక సినీ రంగంపై దృష్టి పెట్టింది. హిందీ భాషపై పట్టుండటంతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లింది. మొదట్లో చిన్నాచితకా చిత్రాల్లో కనిపించింది. అయినా పెద్దగా గుర్తింపు లభించలేదు. దాంతో ఆల్బమ్‌లను చేయడం ఆరంభించింది. వాటిలో హాట్‌గా కనిపిస్తూ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫిజిక్, హాట్ ఎసెట్స్ చూసిన బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ షెర్లిన్‌కు రెడ్ కార్పెట్ వేశారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన హాట్ అప్పియరెన్స్‌తో బాలీవుడ్ కుర్రజనాన్ని వెర్రెత్తించింది. ఆ మధ్య తన అభిమానులకోసమంటూ ట్విట్టర్ పేజీలో తన నగ్న ఫోటోలను అప్‌లోడ్ చేసింది. ట్విట్టర్ యాజమాన్యం వారించినా వినలేదు. దీంతో ఆమె నగ్న ఫోటోలతో సహా ఖాతాను తొలగించేసింది ట్విట్టర్.