వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయి ట్రస్టు: ఆ మాజీ మంత్రి ఎవరు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టును కాపాడడానికి మహారాష్ట్రకు చెందిన ఓ మాజీ మంత్రి ఒత్తిడి తెస్తున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఓ మాజీ మంత్రి ఎవరా అనే సందేహం ఇన్నాళ్లుగా వెంటాడుతూ వచ్చింది. అయితే, సందేహాన్ని ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక తీర్చింది. కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ సత్య సాయి బాబా యజుర్వేద మందిరంలోని సంపద తరలింపు కేసులో సత్య సాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులపై చర్యలు తీసుకోవద్దని ఒత్తిడి తెచ్చినట్లు ఆ పత్రిక రాసింది. అలా ఒత్తిడి తెస్తున్నవాళ్లలో ఆయన ఒక్కరే కాకుండా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారట.

కాగా, ట్రస్టు సభ్యుడు ఆర్‌జె రత్నాకర్‌ను పోలీసులు ఐదు గంటల పాటు ప్రశ్నించారు. మరో సభ్యుడు శ్రీనివాసన్‌కు సమన్లు జారీ చేశారు. అయితే, ఇదంతా తూతూ మంత్రంగానే సాగుతోందని ఆ తెలుగు దినపత్రిక రాసింది. చర్యలు తీసుకున్నామని చెప్పడానికి ఏదో ఒక్కటి చేసి సభ్యులను బయటపడేస్తారని, అందుకే రత్నాకర్ దీమాగా కనిపించారని ఆ పత్రిక ఓ ట్విస్టు ఇచ్చింది. ఇందులో సత్యం ట్రస్టు వ్యవస్థాపకుడు సత్య సాయిబాబా కూడా రుజువు చేయలేకపోవచ్చు.

English summary
According to a Telugu daily former union minister Shivaraj Patil is putting pressure on AP Government regarding Sri Sathya Sai Central Trust affairs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X