చంద్రబాబుకు ఎమ్మెల్యేల షాక్?

పోచారం శ్రీనివాస రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేస్తారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకుని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దగ్గరయ్యారు. సుమన్ రాథోడ్‌కు ఓటింగ్ హక్కు లేదు. కుల ధృవీకరణకు సంబంధించి ఆమెపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. దీంతో ఆమెకు ఓటు హక్కు లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే చంద్రబాబుకు నలుగురు శాసనసభ్యుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడే అవకాశాలు లేవు. మొత్తం మీద, కాంగ్రెసుకే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ తగిలే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications