బాలకృష్ణ నటించిన పరమవీర చక్ర సినిమా కథ తనదేనని ఓ యువకుడు అంటున్నాడు. ఆ కథను తన నుంచి కాపీ కొట్టారని అతను ఆరోపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఆరోపణలు అతి సాధారణంగా మారాయి. దాసరి నారాయణ రావు వంటి ప్రముఖ దర్శకుడికి ఈ ఆరోపణలు తప్పలేదు. తాను ఆ కథను బాలయ్యకు కూడా చూపించానని శ్రీనివాసులు అనే యువకుడు అంటున్నాడు. ఆ సినిమా కథపై తాను అవసరమైతే న్యాయపోరాటం చేస్తానని అతను అంటున్నాడు. ఆ యువకుడు ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఆ ఆరోపణలు చేశాడు. ఆ యువకుడి మాటల్లో నిజమేమిటో ఎవరికి తెలుసంటే ఏమీ చెప్పలేం.