చంద్రబాబుకు సర్వేల తలనొప్పి?

సర్వేలపై టిడిపిలో ఎంతగా ఆందోళన ఉందంటే.. టిడిపి మీడియా కమిటీ సమావేశంలో సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని ప్రస్తావించారట. అయితే సర్వేల ఫలితాలపై టిడిపిలోనూ భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కొంతమంది వ్యక్తులను ప్రమోట్ చేయడానికి సర్వేల పేరుతో క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని, అలాంటి వాటిని నమ్మాల్సిన పరిస్థితి లేదని, అంతేకాకుండా సమయం, సందర్భం లేకుండా సెంటిమెంటు తదితర అంశాల ప్రాతిపదికన చేసే సర్వేలను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు. మరికొందరు తమ్ముళ్లు మాత్రం సర్వేలను పూర్తిగా దూరం పెట్టకుండా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళితే మంచిదని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications