మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎప్పుడూ కూల్‌గా, సౌమ్యంగా కనిపిస్తాడు. కానీ ఈసారి అతనికి కోపమొచ్చింది. నాగపూర్‌లో శనివారం దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచులో భారత బ్యాట్స్‌మెన్ డోంట్ కేర్ పద్ధతికి అతను తీవ్ర అసహనానికి గురైనట్లు కనిపించాడు. అతను మనసు పెట్టి దాటిగా ఆడి 111 పరుగులు సాధించాడు. సెహ్వాగ్, గౌతం గంభీర్ కూడా చక్కగా ఆడారు. అంతా చెడగొట్టింది మిడిల్, లోయర్ ఆర్డరే. 29 పరుగుల్లో చివరి 9 వికెట్లు కోల్పోయింది. ఇందులో పూర్తి నిర్లక్ష్యం కనిపించింది.
ఈ మ్యాచులో ఇండియా స్వయంకృతపరాధంతో ఓటమిని చవి చూసిందనేది ప్రతి ఒక్కరికీ అనిపించింది. అతను స్నానానికి సిద్ధమయ్యే సరికి హరాకిరి చేసిన బ్యాట్స్‌మెన్ బాత్రూంలన్నీ ఆక్రమించారట. కోపాన్ని అణచుకోవడానికి సచిన్ ప్రయత్నించాడు గానీ అది సాధ్యం కాలేదట. ఆ అసహనం ఆ తర్వాత ఫీల్గింగ్‌లోనూ కనిపించింది. అతనిపై టీవీ కెమెరా జూమ్ చేసినప్పుడు తీవ్రంగా కోపగించుకున్నాడు. ఫీల్డింగు చేసేటప్పుడు ఆ అసహనం, కోపం వ్యక్తమవుతూ వచ్చింది.
There were a lot of disappointed faces at the end of the Indian innings against South Africa at the VCA stadium on Saturday - none more than Sachin Tendulkar. He had just played his heart out in an effort to put his team in a commanding position from where they could dictate the game
Story first published: Monday, March 14, 2011, 9:26 [IST]