భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత మమతా బెనర్జీకి కోపమొచ్చింది. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల కోసం సౌరవ్ గంగూలీతో దృశ్య శ్రవణ ప్రోమోకు సౌరవ్ గంగూలీని ఎంపిక చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెసు పార్టీ వ్యతిరేకిస్తోంది. రాజకీయంగా గంగూలీ పాలక సిపిఎం పార్టీకి చెందినవాడని అంటూ అందుకు అభ్యంతరం తెలిపింది. వోటుపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఎన్నికల సంఘం ఆ ప్రోమోను నిర్మించింది.
ఎన్నికల్లో గంగూలీ తమ పార్టీకి ప్రచారం చేస్తారని పట్టణాభివృద్ధి మంత్రి అశోక్ భట్టాచార్య చెప్పడంతో వివాదం ప్రారంభమైంది. గంగూలీ ఏ రాజకీయ పార్టీకైనా ప్రచారం చేయడానికి అంగీకరిస్తే ప్రొమోను ఉపసంహరించుకుంటామని, తన రాజకీయ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసే గంగూలీ అధికారాన్ని తాము ఆపలేమని అదనపు ఎన్నికల ప్రధానాధికారి ఎన్‌కె సహానా చెప్పారు.
The Election Commission's decision selecting former India cricket captain Sourav Ganguly for an audio-visual promo for West Bengal assembly elections has run into trouble with Trinamool Congress complaining that he was politically affiliated to ruling CPI(M).
Story first published: Thursday, March 31, 2011, 8:34 [IST]