కెసిఆర్‌కు టోకరా, బిజెపిలోకి రాములమ్మ?

వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిజానికి ఆమె కాంగ్రెసులోకి దూకాల్సి ఉండింది. వైయస్ మరణంతో ఆ దూకుడుకు కళ్లెం పడింది. తెరాసలోనే ఆమె అణగిమణకి కాలం వెళ్లదీస్తున్నారు. పార్టీ బహిరంగ సభల్లో విజయశాంతిని కెసిఆర్ పక్కనే కూర్చుండబెట్టుకున్నారు, చెల్లెలిగా మర్యాద ఇస్తున్నారు. కానీ మాట్లాడేందుకు మాత్రం సుతారాం అవకాశం ఇవ్వడం లేదు. గుండె భగభగ మండిపోతున్నా కాలం కలసి రానప్పుడు ఏం చేస్తామనే నిర్వేదంతో ఆమె తెరాసలో కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సుష్మా స్వరాజ్ తెలంగాణలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి లోకసభకు పోటీ చేసే అవకాశాలున్నాయి. ఆమెకు విజయశాంతి గ్లామర్ తోడైతే బిజెపి ముందుకు సాగుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications