వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ వివేకా భవిష్యత్తు ఏమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
వదిన వైయస్ విజయమ్మ చేతిలో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెసు నాయకుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. పులివెందులలో గెలిస్తే తప్ప తాను మంత్రిపదవి తీసుకోనని, నామినేటెడ్ పదవులు తనకు అవసరం లేదని, ఎమ్మెల్సీగా కూడా ఎంపిక కావడం తనకు ఇష్టం లేదని ఆయన చెబుతూ వచ్చారు. ఆ స్థితిలో ఆయన భవిష్యత్తు ఏమిటనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వివేకానంద రెడ్డి తన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని వెంట పెట్టుకుని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.

సోనియాతో వైయస్ వివేకానంద రెడ్డి ఏం చెప్పుకున్నారో, ఎలా తనను తాను సమర్థించుకున్నారో తెలియదు. అధిష్టానం చెప్పినట్లు నడుచుకుంటానని ఆయన చెబుతున్నారు. దీన్ని బట్టి ఆయన తాను చేసిన ప్రతినల నుంచి వెనక్కి తగ్గేట్లే కనిపిస్తోంది. ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో ఎన్నికై, మంత్రి పదవి చేపట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. తనకు ఇష్టం లేకపోయినా అధిష్టానం చెప్పింది కాబట్టి అంగీకరించానని ఆయన సమర్థించుకునే అవకాశాలున్నాయి.

English summary
It is interesting about the future of YS Vivekananda Reddy. He met Congress president Sonia Gandhi on tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X