బాలకృష్ణ ఎందుకు వెనక్కి తగ్గారు?

Balakrishna
తెలంగాణపై మనసులో మాటను బయటపెట్టిన తెలుగుదేశం నాయకుడు, సినీ హీరో బాలకృష్ణ తన ప్రకటనను వెనక్కి తీసుకోవడం వెనక ఏం పనిచేసిందనేది చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ తన మాటను వెనక్కి తీసుకున్నందుకు చాలా మంది మనసు నొచ్చుకునే ఉంటారు. వెనక్కి తీసుకున్నందుకు తెలంగాణవాదులు సంతోషించకపోగా, సీమాంధ్ర నుంచి వ్యతిరేకత చవి చూస్తారా అనేది తేలాల్సిన విషయమే. కానీ, బాలకృష్ణ తన ప్రకటనను వెనక్కి తీసుకోవడానికి బలమైన కారణాలే ఉన్నాయని అంటున్నారు. అందులో త్వరలో విడుదల కానున్న శ్రీరామరాజ్యం సినిమా ప్రదర్సనపై తెలంగాణలో తీవ్రమైన ప్రభావం పడే సూచనలు కనిపించాయి. అది బాలయ్యను వెనక్కి లాగిందని అంటున్నారు.

మరో కారణం బాలయ్య తన ప్రకటనను వెనక్కి తీసుకోవడానికి పని చేసిందని చెబుతున్నారు. రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించాలని అనుకుంటున్న ఆయనకు తెలంగాణపై చేసిన ప్రకటన పిడుగుపాటు అయ్యే ప్రమాదం వచ్చి పడింది. తెలంగాణ సమస్యను తేల్చాల్సిన బాధ్యతను కేంద్రం మీదికి నెట్టేసి బావ చంద్రబాబులాగే నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండక, కొరవితో తల గోక్కువడం ఎందుకనే అభిప్రాయం శ్రేయోభిలాషుల నుంచి వచ్చిందట. అందుకే నష్టనివారణకు గాను ఆయన తన ప్రకటనను వెనక్కి తీసుకున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+