కాంగ్రెసుతో వైయస్ జగన్ సీక్రెట్ డీల్?

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సాక్షి దినపత్రికకు వచ్చిన అడ్వర్టయిజ్‌మెంట్లు జగన్ కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయని అంటున్నారు. సాక్షి దినపత్రికకు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద యెత్తున యాడ్స్ రాగా, ఇతర పత్రికలకు నామమాత్రంగానే వచ్చాయి. ఇదెలా జరిగిందని ముక్కున వేలేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. జగన్ కాంగ్రెసు పెద్దలతో చేసుకున్న ఒప్పందం ఆ రకంగా ఉపయోగపడిందని, సిబిఐ దర్యాప్తులో కూడా వేగం తగ్గిందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications