'జగన్ సాక్షి వెబ్ పోల్: ఐదు నిమిషాల్లో...?'

Sakshi Daily
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా వెబ్ సైట్ పోల్‌లో భారీ రిగ్గింగ్ పాల్పడిందంటూ ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది. ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సాక్షి మీడియాకు ప్రభుత్వ ప్రకటనలను రద్దు చేస్తూ జివో జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై జగన్ మీడియా ఓ పోల్ నిర్వహించింది. అందులో సాక్షికి ప్రభుత్వ ప్రకటనల్ని నిలిపివేయడం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనా? అనే ప్రశ్న వేసింది. సమాధానాలుగా ఔను, కాదు, తెలియదు అని ఇచ్చింది.

అయితే జగన్ మీడియా ఐదు నిమిషాల్లోనే పోల్‌లో రిగ్గింగ్‌కు పాల్పడిందంటూ ఆంధ్రజ్యోతి ఫోటోలతో సహా కథనాన్ని ప్రచురించింది. పత్రిక కథనం.. జగన్ మీడియా నాలుగైదు నిమిషాల్లో జనాభిప్రాయాన్ని తారుమారు చేసిందని చెప్పారు. లేని జనామోదాన్ని సృష్టించుకునేందుకు జగన్ తన పత్రికకు చెందిన వెబ్‌సైట్‌లో ఎలక్ట్రానిక్ రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నారు. కానీ అసలు విషయం బట్టబయలైందని తెలిపింది. జగన్ పత్రికకు ప్రభుత్వ ప్రకటనలను ఆపి వేసిన సంగతి తెలిసిందే! దీనిపై ఆయన పత్రిక వెబ్‌సైట్ ఓ పోల్ నిర్వహించింది.

ఇలా ప్రభుత్వ ప్రకటనలను నిలిపివేయడం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనా? అని నెటిజన్లను ప్రశ్నించింది. అవును, కాదు, తెలియదు... అనే మూడు ఆప్షన్లు ఇచ్చింది. ఔను.. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అని నెటిజన్లు క్లిక్‌లతో హోరెత్తిస్తారని జగన్ మీడియా భావించిందని, కానీ... కథ అడ్డం తిరిగిందని, శనివారం మధ్యాహ్నం 12.46 గంటల సమయానికి కేవలం 23,811 మంది మాత్రమే వారు అనుకున్నట్లుగా ఓటు వేశారని అందుకు సంబంధించిన ఫోటోను ప్రచురించింది.

ఏకంగా 56,609 మంది ప్రభుత్వ ప్రకటనలు ఆపివేయడానికీ, భావ ప్రకటన స్వేచ్ఛకూ సంబంధం లేదని తేల్చేశారని, దీంతో జగన్ మీడియా బెంబేలెత్తిందని, అడ్డం తిరిగిన కథను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పోల్‌మాల్‌కు పాల్పడిందని పేర్కొంది. ఫలితాలను తారుమారు చేసిందని, ఐదంటే ఐదు నిమిషాల తర్వాత అంటే 12.51 గంటలకు జగన్ మీడియాకు అనుకూలంగా 1,00,670 ఓట్లు ప్రత్యక్షమయ్యాయని తెలిపింది.

వ్యతిరేక ఓట్ల సంఖ్య మాత్రం స్వల్పంగా పెరిగి 56,901 వద్ద ఆగింది. కేవలం ఐదు నిమిషాల్లో దాదాపు 80వేల అనుకూల ఓట్లు పడటం అసాధ్యం. ఇది ఫలితాలను తారుమారు చేసే వెబ్ రిగ్గింగ్ ఫలితమని, జస్ట్ ఐదేళ్లలో వేల కోట్లు సంపాదించుకున్న జగన్ ఐదు నిమిషాల్లో 80 వేల ఓట్లు తెచ్చుకోలేరా అని ప్రశ్నిస్తే అది వాళ్లిష్టమని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+