నిన్న చెర్రీ నేడు మోక్షజ్ఞ: చిరు దారిలో బాలకృష్ణ

ఇప్పుడు మోక్షజ్ఞతో రావడంతో ఆయన రాజకీయ ఆరంగేట్రం సాధ్యమైనంత త్వరగా ఉంటుందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. బాలయ్య 2014 ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో సినీ రంగానికి తన వారసుడు ఉండాలని బాలయ్య భావించి ఉంటారని అంటున్నారు. అందుకే మోక్షజ్ఞను అంతకుముందే తెలుగు తెరకు పరిచయం చేయాలని ఆయన భావిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
2014 సాధారణ ఎన్నికలలో బాలయ్య పోటీ చేస్తే సినిమాలు చేసే అవకాశం రాకపోవచ్చు. ఆయనకు ఆసక్తి ఉన్నప్పటికీ కుదిరే అవకాశం తక్కువ. ఇప్పటికే చిరంజీవి విషయంలో దానిని చూస్తున్నాం. గత నాలుగేళ్లుగా తన నూటా యాభయ్యవ చిత్రం ఉంటుందని చిరంజీవి చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు దాని ఊసే లేదు. బాలయ్యకు కూడా నటించాలనే కోరిక ఉన్నప్పటికీ రాజకీయాల్లోకి వచ్చాక అవకాశాలు దొరకవు. దీంతో ఆయన సినిమాలకు దూరంగా ఉండే అవకాశముంది. అందుకే తన వారసుడిగా మోక్షజ్ఞను త్వరగా పరిచయం చేయాలని బాలయ్య భావిస్తున్నారని అంటున్నారు.
2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. దానికి సంవత్సరానికి ముందే అంటే 2007లో రామ్ చరణ్ తేజ చిరుతగా పరిచయమయ్యాడు. ఇప్పుడు బాలయ్య కూడా తన రాజకీయ ఆరంగేట్రానికి ముందు మోక్షజ్ఞచే ఓ మంచి సినిమాను ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications