ముఖంపై మాస్క్‌ను తిప్పికొట్టిన భాను కిరణ్

ముఖానికి మాస్క్ వేయడానికి అధికారులు తీవ్రంగానే ప్రయత్నించారని అంటున్నారు. రాయలసీమ ఫాక్షన్ కారణంగా అతని ముఖాన్ని మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారని అంటారు. కానీ అందుకు భాను కిరణ్ ససేమిరా అన్నట్లు వార్తలు వచ్చాయి.
ఓ ఆంగ్ల దినపత్రిక రాసిన వివరాల ప్రకారం - గూగుల్‌కు వెళ్లి భాను కిరణ్ అని టైప్ చేస్తే వందలాది వీడియోలు వస్తాయని, సమాజంలో తాను అందరికీ తెలుసునని, తాను ఎలా ఉంటానో తెలుసునని, తన ఫొటోలను వార్తాపత్రికలు కూడా ప్రచురించాయని, తాను మాస్క్ వేసుకోదలుచుకులేదని, తనపై ఒత్తిడి పెట్టవద్దని భాను కిరణ్ కచ్చితంగా చెప్పాడు.
మరో విషయం కూడా భాను కిరణ్ సిఐడి అధికారులకు చెప్పాడట. తన ముఖానికి మాస్క్ వేస్తే ప్రజలు, మీడియా తనను కాకుండా మరో వ్యక్తిని ప్రవేశపెట్టారని అనుమానిస్తారని, ఎవరో ఒకరిని తీసుకొచ్చి భాను కిరణ్‌గా చూపించారని అనుమానిస్తారని కూడా చెప్పాడట. భాను కిరణ్‌కు చెర్లపల్లి జైలులో అధికారులు ప్రత్యేక బ్లాక్‌ను కేటాయించారు.












Click it and Unblock the Notifications