హీనాయే కాదు: 19 ఏళ్లప్పుడే బిలావల్ రొమాన్స్

Bilawal Bhuttoa's hidden Casanova trait |
పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తనయుడు, పిపిపి నేత బిలావల్ భుట్టో, విదేశాంగశాఖ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ప్రేమాయణం వెలుగులోకి వచ్చాక బిలావల్ రొమాన్స్ వ్యవహారాలు కొత్తకొత్తగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే బిలావల్ ఓ యువతికి అధర చుంబనం ఇస్తున్న ఫోటో ఇంటర్‌నెట్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అది హీనా రబ్బానీ ఖర్ అనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

బిలావల్ కేవలం హీనాతో కాదు అతని పందొమ్మిదేళ్ల వయస్సులో ఉన్నప్పటి నుండే అమ్మాయిలతో రొమాన్స్ చేసేవాడట. ఇది కూడా వీక్లీ బ్లిట్జ్‌యే చెప్పింది. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. బూజీ సుజీ అనే యువతి బిలావల్‌కు సన్నిహితురాలు. అలాగే, మరో ఇద్దరు యువతులు బిలావల్‌కు సన్నిహితమని ప్రచారం ఉంది. వారి పేర్లు జూలియా కేటరీనా హార్ట్లే, కిరిని కోప్కే.

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో బిలావల్.. జాన్వీ అనే యువతితో రిలేషన్ కొనసాగించాడట. ఇది హీనా ఘటన తర్వాత బయటకు వచ్చింది. అవి ఎమ్మెమ్మెస్ రూపంలో బయటకు వచ్చి పాకిస్తాన్ సహా పలు దేశాల్లో విస్తరిస్తోందట. అయితే పాకిస్తాన్ అధికారులు వాటిని కొట్టి పారేస్తున్నారట.

కాగా విదేశీ వ్యవహారాల మంత్రి హీనా రబ్బానీ ఖర్, బిలావల్ భుట్టో జర్దారీల ప్రతిష్ఠను దెబ్బ తీయడంలో ఐఎస్ఐ పాత్ర ఉందన్న ఆరోపణలను పాకిస్తాన్ సైన్యం ఖండించింది. బంగ్లాదేశ్‌కు చెందిన టాబ్లాయిడ్ బ్లిట్జ్ ద్వారా ఖర్, బిలావల్ ప్రేమాయణం ఉన్నట్టుగా ఐఎస్ఐ ప్రచారం చేసిందని బ్రిటన్‌కు చెందిన టెలిగ్రాఫ్ పత్రిక ఆరోపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+