వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టుకుంటే పదివేలు: జయప్రదకు చేదు అనుభవం

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprada
లక్నో: ప్రముఖ సినీనటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రదను ఆదరించిన ప్రజలే వ్యతిరేకించారు. ఉత్తరప్రదేశ్‌లోని తన నియోజకవర్గం రాంపూర్‌లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. నాలుగు నెలల తర్వాత శనివారం ఆమె రాంపూర్ నియోజకవర్గానికి వెళ్లారు. కార్యాలయానికి చేరుకున్న ఆమెకు విస్తుపోయే బ్యానర్లు కనిపించాయి.

తనను వెక్కిరిస్తూ రాసి ఉన్న బ్యానర్లు కనిపించే సరికి జయప్రద కిన్నురాలయ్యారట. 'మా ఎంపీ కనిపించడం లేదు. ఆమెను పట్టిస్తే పదివేల రూపాయల బహుమతి ఇస్తాం' అని ఈ బ్యానర్లపై రాశారు. "ముంబై, ఢిల్లీల్లోనే ఉండడానికి ఇష్టపడే ఎంపీ మాకొ ద్దు'' అంటూ శ్యామ్‌సింగ్ అనే స్థానికుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

2010 జనవరిలో జయప్రదను అమర్‌సింగ్‌తో పాటు సమాజ్‌వాది పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఆ పార్టీ ఇంకా స్పీకర్‌కు నోటిషికేషన్ ఇవ్వాల్సి ఉంది. సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురి కావడంతో జయప్రద భవిష్యత్తు అయోమయంలో పడింది. మళ్లీ రాంపూర్‌ను నమ్ముకునే స్థితి లేదు.

ఉత్తరప్రదేశ్ రాజకీయాలు తనకు అనుకూలంగా లేకపోవడంతో జయప్రద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఏదో పార్టీలో చేరి మళ్లీ రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నారు. తెలుగుదేశంలో చేరాలా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలా అనే విషయాన్ని ఆమె తేల్చుకోలేకపోతున్నారు.

English summary

 Uttar Pradesh Rampur MP and actress Jayaprada has faced bitter experience in her constituency. Local people opposed her absence in the constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X