పవన్ 'రాంబాబు': విజయశాంతినీ వదలలేదా?

విజయశాంతి మౌనానికి కారణం ఏమిటని కొంత మంది వాకబు చేశారట. దీంతో అసలు విషయం బయటపడిందని అంటున్నారు. కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాలో విజయశాంతిని కూడా దర్శకుడు పూరీ జగన్నాథ్ వదిలిపెట్టలేదని అంటున్నారు. ఈ చిత్రంలో గుండక్క అనే పాత్రను విజయశాంతిని దృష్టి పెట్టుకుని రూపొందించారనే తాజాగా ఓ పుకారు షికారు చేస్తోంది.
విభజన కోరుకునే పార్టీకి మద్దతుగా గుట్కా నములుతూ ఉండే గుండక్క పాత్ర విజయశాంతిని పోలి ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. తెలంగాణ వివాదాల్లో ఒంటి కాలి మీద లేచే లేడీ బాస్ కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాపై మాట్లాడకపోవడానికి కారణం ఆ పాత్రనే అంటున్నారు.
సినిమాపై తాను స్పందిస్తే గుండక్క పాత్రపై చర్చ ప్రారంభమవుతుందని, ఆ పాత్రను తనను దృష్టిలో పెట్టుకునే రూపొందించారని భావిస్తారని, గుండక్క పాత్రపై బహిరంగంగా చర్చ జరగకపోవడమే మేలని అనుకుని వివాదానికి దూరంగా ఉన్నారట. తాను మాట్లాడితే ఆ పాత్రపై చర్చ ముందుకు వస్తుందని విజయశాంతి అనుకున్నారని వినికిడి. అయినా సరే, విజయశాంతి ఊరుకునే మనిషి కాదే అంటున్నారు.












Click it and Unblock the Notifications