వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవర్ స్టార్ సినిమా: జగన్ పార్టీతో పూరీ లింక్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Puri Jagannath
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాతో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో దర్శకుడు పూరీ జగన్నాథ్ సంబంధాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పూరీ జగన్నాథ్ గతంలో వైయస్ రాజశేఖర రెడ్డిపై సినిమా తీస్తానని ప్రకటించారు. కానీ, అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. వైయస్ రాజశేఖర రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకోవడానికి, వైయస్ జగన్ పార్టీ పట్ల తనకున్న సానూకూల వైఖరిని కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాతో తీర్చుకున్నాడని గిట్టనివారు చెవులు కొరుక్కుంటున్నారు.

పూరీ జగన్నాథ్ సోదరుడు గణేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. ఇదే విషయంపై శుక్రవారం పూరీ జగన్నాథ్‌కు మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. పైగా, తనను రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దని ఓ మీడియా ప్రతినిధికి సలహా ఇచ్చారు. ఆ సలహా ఇస్తూ మీడియా సమావేశం నుంచి లేచి వెళ్లిపోయారు. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా వివాదంపై మాట్లాడడానికి ఆయన ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

కాగా, ఉప ఎన్నికల సందర్భంగా ఈ ఏడాది మేలో నర్సీపట్నంలోని పూరీ జగన్నాథ్ ఇంట్లో వైయస్ విజయమ్మ, షర్మిల బస చేశారు. దానికి పూరీ జగన్నాథ్ ఎంతో మురిసిపోయారు కూడా. విజయమ్మ, తమ ఇంట్లో బస చేయడం తనకెంతో ఆనందాన్నిస్తోందని, తామంతా వారి కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తామని ఆయన పొంగిపోయారు.

పూరీ జగన్నాథ్ అనుబంధం ఈనాటిది కాదు. పూరీ జగన్నాథ్ కూతురు జన్మదిన వేడులకు వైయస్ జగన్ హాజరయ్యారు. అది అప్పట్లో పెద్ద సంచలమైంది. పూరీ సంతోషంపై ప్రముఖ దర్సక నిర్మాత రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు. ఏమైనా, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో అటు చంద్రబాబును, ఇటు కెసిఆర్‌ను ఏకి పారేయడం ద్వారా వైయస్సార్ కాంగ్రెసుతో తనకున్న అనుబంధాన్ని పూరీ జగన్నాథ్ చాటుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సినిమాలో తాను చంద్రబాబును విమర్శించలేదని, తెలంగాణ ప్రస్తావనే లేదని పూరీ ఎంతగా చెప్పినా చింత చచ్చినా పులుపు చావదనే సామెతను గుర్తు చేస్తున్నారు.

English summary
Buz is that director Puri Jagannath has exhibited his YS Jagan's YSR Congress party pro stand in Pawan Kalyan's Cameraman Ganga tho Rambabu movie. He is having friendship with YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X