చంద్రబాబును పట్టుకున్న స్టేజీ ఫియర్?

వేదికపైకి నాయకులు వరుస కట్టి ఎక్కుతూ ఉండడమే పెద్ద సమస్యగా మారినట్లు చెబుతున్నారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించడానికి వేదికలను ఎక్కడాన్ని చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి వదిలేసినట్లు సమాచారం. వ్యాన్‌పై నించుని మాట్లాడడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ నాయకులు కూడా చంద్రబాబు వేదికలకు ఎక్కడానికి ఇష్టపడడం లేదని చెబుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, ఖానాపూర్‌ల్లో చంద్రబాబు వేదికలను అధిరోహించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి ఇష్టపడలేదు. ఇదే పద్ధతిని ఆయన తన పాదయాత్ర యావత్తూ అనుసరించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. నిర్మల్‌లో పక్కనే ఉన్న వేదికను వదిలేసి, ఎన్టీఆర్ విగ్రహం కోసం పెట్టిన ఇనుప మెట్ల మీది నుంచి చంద్రబాబు ప్రసంగించారు.
ఖానాపూర్‌లో కూడా చంద్రబాబు కోసం వేదిక ఏర్పాటైంది. అయితే, వేదికపైకి వెళ్లకుండా ఆయన వ్యాన్‌పై నుంచి ప్రసంగం చేశారు. భారీ బహిరంగ సభలను కూడా చంద్రబాబు ఇష్టపడడం లేదని చెబుతున్నారు. పాదయాత్ర సందర్భంగా ఎదురయ్యే గుంపులను ఉద్దేశించి మాట్లాడడానికే ఆయన ఇష్టపడుతున్నారట.












Click it and Unblock the Notifications