వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్థసారథిని కాపాడిన చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
రాజీనామా గండం నుంచి మంత్రి పార్థసారథిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే గట్టెక్కించారనే ప్రచారం సాగుతోంది. అయితే, చంద్రబాబు ఏదో అడ్డం పడి రాజీనామా చేయకుండా పార్థసారథికి అండగా నిలిచారని కాదు. చంద్రబాబు ఇటీవల ప్రకటించిన బీసీ డిక్లరేషన్ పార్థసారథిని కాపాడినట్లు చెబుతున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో రెండు నెలలు జైలు శిక్ష పడిన పార్థసారథి చేత రాజీనామా చేయించాలని కాంగ్రెుస అధిష్టానం నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

పార్థసారథిని కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అడ్డం పెట్టినట్లు చెబుతున్నారు. బీసీలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తూ చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించిన నేపథ్యంలో బీసీ అయిన పార్థసారథి చేత రాజీనామా చేయిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందువల్ల పార్థసారథి చేత ఇప్పుడే రాజీనామా చేయించడం మంచిది కాదని ముఖ్యమంత్రి అధిష్టానానికి నచ్చజెప్పారు.

ఇప్పటికే బీసీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కుని మంత్రి పదవికి రాజీనామా చేశారని, మరో బీసీ నేతతో మంత్రి పదవికి రాజీనామా చేయిస్తే బీసీల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. పైగా, తనకు పడిన శిక్షను సవాల్ చేస్తూ పార్థసారథి హైకోర్టుకు వెళ్తున్నారని, హైకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత పార్థసారథికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవచ్చునని ముఖ్యమంత్రి అధిష్టానానికి వివరించినట్లు చెబుతున్నారు.

చంద్రబాబు ఆ రకంగా పార్థసారథి మంత్రి పదవిని కాపాడారని అనుకుంటున్నారు. పార్థసారథి చేత రాజీనామా చేయిస్తే తాము ఆందోళనకు దిగుతామని బిసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. బీసీ సంఘాలు పార్థసారథికి అండగా నిలుస్తున్నాయి. అదే సమయంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పార్థసారథికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. మొత్తం మీద పార్థసారథికి బీసీ కార్డు ఉపయోగపడినట్లే చెప్పాలి.

English summary
It is said that Telugudesam party president N Chandrababu Naidu's BC declaration has protected minister Parthasarathi. CM Kiran kumar Reddy referring the BC declaration of TDP, has convinced high command in Parthasarathi issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X