మహేష్ బాబుకు కాంగ్రెసు గాలం?

ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహతుడైన ఎమ్మెల్సీ రంగా రెడ్డి మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది. మహేష్ బాబు పార్టీలోకి వస్తే తగిన స్థానం కల్పిస్తామని ఆయన ఓ మీడియా చానెల్‌తో అన్నారు. శేషగిరి రావు మొదటి నుంచీ కాంగ్రెసులోనే ఉంటూ వస్తున్నారని, కృష్ణ కుటుంబానికి కాంగ్రెసుతో అనుబంధం ఉందని ఆయన అన్నారు. అయితే, మహేష్ బాబుకు మాత్రం రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేనట్లు అనిపిస్తోంది. ఆయన గతంలో పలు మార్లు ఆ విషయం చెప్పారు. ఏమైనా, ఎప్పుడు ఏమవుతుందో రాజకీయాల్లో చెప్పలేం.












Click it and Unblock the Notifications