ఒకరు జగన్‌తో: మరొకరు చంద్రబాబుతో?

వచ్చే ఉప ఎన్నికల్లో సిపిఐ సిపిఎం అభ్యర్థులకు కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు మద్దతు తెలుపుతోంది. పైగా, వచ్చే ఎన్నికల్లో తెరాసతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించింది. సిపిఐ సిపిఎంను పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టంగానే కనిపిస్తోంది.
సిపిఎం గతంలో తెలుగుదేశంతో దోస్తీ కట్టింది. సిపిఐ కన్నా తెలుగుదేశం పార్టీకి సిపిఎంతోనే బంధం ఎక్కువ. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడానికి విముఖత ప్రదర్శించింది. తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసేది లేదని స్పష్టం చేసింది. అయితే, సిపిఎం నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో చేతులు కలిపే అవకాశాలున్నట్లు గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని సిపిఎం కచ్చితంగా కొట్టేడయం లేదు.
సిపిఐ, సిపిఎం సహోదర పార్టీల రాష్ట్ర కార్యదర్శుల్లో కె. నారాయణ చంద్రబాబుతో కలిసి పని చేస్తే, బివి రాఘవులు వైయస్ జగన్‌తో చేతులు కలుపుతారనే వార్తలు వస్తున్నాయి. అంటే, ఉభయ కమ్యూనిస్టులు ఉత్తరదక్షిణ ధ్రువాలుగా పనిచేస్తారని అనుకోవచ్చు. మరో మాట కూడా చెప్పుకోవాలి. లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ఈ రెండు కమ్యూనిస్టు పార్టీలతోనూ కలిసి పనిచేయడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications