ఔట్ - ఇన్: దాసరి స్థానంలో చిరంజీవి?

Chiranjeevi and Dasari Narayana Rao
కష్టకాలంలో ప్రభుత్వాన్ని ఆదుకున్న తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గానికి ఆలస్యంగానైనా పదవులు దక్కుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఇప్పటికే రెండు పదవులు ఓకే అయ్యాయి. స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కాంగ్రెసు అధిష్టానం మాత్రం చిరంజీవి సూచించిన సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులకే పదవులు అప్పజెప్పేందుకు దాదాపు రంగం సిద్ధమైపోయింది. ఇక చిరు వర్గం పెట్టుకోవాల్సిన ముహూర్తమే ఆలస్యం. అదే సమయంలో చిరంజీవికి కూడా త్వరలో కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించాలని అధిష్టానం భావిస్తోంది. ఏప్రిల్‌లో రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఖాళీ అవుతున్న స్థానాల్లో ప్రముఖ దర్శక, నటుడు దాసరి నారాయణ స్థానం కూడా ఉంది.

సాధారణంగా కాంగ్రెసులో ఒక్కో అభ్యర్థికి రెండుసార్లు రాజ్యసభ అవకాశం కల్పిస్తారు. దాసరికి ఇప్పటికే రెండుసార్లు అది పూర్తయింది. దీంతో దాసరికి మరోసారి అవకాశం కల్పించక పోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన గుర్తుంచుకోదగ్గ పనితీరు చూపకపోవడం, సభకు అరుదుగా మాత్రమే హాజరుకావడం వంటి అంశాలు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా చిరును మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే రాజ్యసభ స్థానం కేటాయించవలసి ఉంటుంది. దాసరిని తప్పించి, ఆదే సామాజికవర్గానికి చెందిన చిరంజీవికి ఆ స్థానాన్ని కేటాయించడం ద్వారా భర్తీ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+