జగన్‌కు గణపతి ఆశీస్సులు!: జక్కన్నఈగ పైనా..

అదే తరహా సెట్‌ను వారు వేశారు. జగన్ జైలులో ఉన్నట్లుగా, బయటి నుండి పంచెకట్టు, తలపాగా చుట్టుకున్న వినాయక దేవుడు అతనిని ఆశీర్వదిస్తున్నట్లుగా సెట్ వేశారు. కుడివైపుకు నిల్చుని ఉన్న విఘ్నేశ్వరుడు జగన్ వైపుకు చేయి చాపి ఆశీర్వదించినట్లుగా ఉంది. ఎడమ వైపును గణేషుడి వాహనం ఎలుక ఉంది. దీనిని విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఏర్పాటు చేశారు.
రాజధాని హైదరాబాదులో వివిధ రకాల వినాయక విగ్రహాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. మంచు వినాయకుడు, గోవుపై ఉన్న వినాయకుడు, అశ్వధారి వినాయకుడు, బాల గణపతి, మంచు వినాయకుడు, టెంకాయలతో, పండ్లతో, రుద్రాక్షలతో, చాక్లెట్లతో.. ఇలు పలురకాల వస్తువులతో తయారు చేసిన విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. పార్వతీ పరమేశ్వర సమేత గణపతి, బాలగణపతిలను ఏర్పాటు చేశారు.
అబిడ్స్‌లో ఏర్పాటు చేసిన ఈగ గణపతి అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇటీవల ఈగ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. సినిమాలో ఉన్నలాంటి ఈగపై వినాయకుడు నిల్చున్నాడు. గుడిమల్కాపూర్‌లోని ఓ వినాయక మండపంలో అవినీతిపరులకు జైలు పరులను జైలులో కూర్చున్నట్లుగా ఓ సెట్ వేశారు.












Click it and Unblock the Notifications