బేఫికర్: ముందే దుబాయ్‌లో ఉల్లాసంగా గంటా

Ganta Srinivas Rao
మంత్రి వర్గ విస్తరణకు ముందు మన నేతలు ఎంత బిజిగా గడిపారో, ఎంత టెన్షన్‌గా గడిపారో చూస్తూనే ఉన్నాం. కాంగ్రెసు పార్టీ అధిష్టానం కేవలం చిరంజీవి వర్గంలోని ఇద్దరితోనే విస్తరణ చేసి సరిపెట్టాలని సూచించడంతో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పునర్వ్యవస్థీకరణ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. విస్తరణకు రెండు మూడు రోజుల నుండి తీవ్ర కసరత్తు చేశారు. ఢిల్లీ వెళ్లాక అధిష్టానాన్ని ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మరోవైపు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విస్తరణ అంశంపై ఢిల్లీలో బిజిబిజిగా గడిపారు. తన వర్గం వారికి మంత్రి పదవుల ఇప్పించుకునే విషయంలో భాగంగా చిరంజీవిది అదే పరిస్థితి. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మల్సీల సిఎం, పిసిసి చీఫ్‌, అధిష్టానం చుట్టూ తిరిగారు.

కానీ చిరంజీవి వర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మాత్రం వీరందరికీ మినహాయింపు. ఎవరికైనా వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటేనే టెన్షన్ టెన్షన్. తన బెర్త్ ఖాయమని ఎప్పుడో తెలిసి పోవడంతో గంటా మాత్రం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. ఎలాంటి ఆందోళన లేకుండా విదేశాల్లో కులాసాగా గడిపారు. విస్తరణకు మూడు రోజుల ముందు సోమవారం దుబాయ్‌లో హాయిగా క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్ చేశారు. అదే రోజు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+