కిరణ్ కుమార్ రెడ్డిపై మేడం సోనియా గుర్రు

Sonia Gandhi-Kiran Kuamr Reddy
సమాచార కమీషనర్ల నియామకం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తల మీదికి వచ్చింది. అన్నీ రాజకీయ నియామకాలే అని తేలడంతో ఆయన పార్టీ అధిష్టానం నుంచి ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సూచించినవారికి, శానససభ్యుడు చిరంజీవి సూచించినవారికి ఆయన కమీషనర్ల పదవులు కట్టబెట్టిన విషయం అధిష్టానం దృష్టికి వచ్చింది. దాంతో సమాచార కమిషనర్ల నియామకం ఫైలును క్లియర్ చేయకుండా గవర్నర్ నరసింహన్ ఆపి ఉంచారు. ఈ నియామకాల పట్ల గవర్నర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.

సమాచార కమీషనర్ల నియామకంపై కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి వివరణ కోరినట్లు తెలుస్తోంది. మేడం అసంతృప్తిగా ఉన్నారని అహ్మద్ పటేల్ చెప్పారట. ఎనిమిది కమీషనర్లలో నలుగురికి రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండడమో, ఇతర పదవుల్లో ఉండడమో జరిగిందని అంటున్నారు. విజయ నిర్మల ప్రజారాజ్యం తరఫున గత ఎన్నికల్లో పోటీ చేయగా, లామ్ తాంతియా కుమారి కాంగ్రెసు జడ్‌పిటిసి. మరీ విచిత్రమేమిటంటే ఇంతియాజ్ అహ్మద్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైనే పీలేరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెసులో చేరారు. ప్రతిఫలంగా ముఖ్యమంత్రి ఆయనకు సమాచార కమిషనర్ పదవిని కట్టబెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+