రామచంద్రయ్య జగన్ ఆంతరంగిక ఆడిటర్?

C Ramachandraiah
కాంగ్రెసు నేత చిరంజీవి వర్గానికి చెందిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యపై కడప జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయకులు దాడిని తీవ్రం చేశారు. సి. రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వవద్దని పార్టీ అధిష్టానంపై తీవ్రంగా ఒత్తిడి పెడుతున్నారు. కడప జిల్లాకు చెందిన మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, అహ్మదుల్లా, శాసనసభ్యుడు వీరశివా రెడ్డి, ఎమ్మెల్సీ చెంగల్రాయుడు సి. రామచంద్రయ్యకు వ్యతిరేకంగా ఢిల్లీ దాకా వెళ్లారు. వీరశివా రెడ్డి ఓ మెట్టు పైకి ఎక్కి రామచంద్రయ్య తీవ్రమైన ఆరోపణలు చేశారు. రామచంద్రయ్య వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆంతరంగిక ఆడిటర్ అని ఆయన ఆరోపించారు. అరెస్టయి జైలులో ఉన్న విజయ సాయి రెడ్డి వైయస్ జగన్‌కు అధికారిక ఆడిటర్ అయితే, రామచంద్రయ్య ఆంతరంగిక ఆడిటర్ అని ఆయన అన్నారు.

వైయస్ జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌కు రామచంద్రయ్యకు చెందిన రఘురామ్ సిమెంట్స్ మాతృ సంస్థ అని ఫిర్యాదు చేశారు. వార్డు మెంబర్‌గా గెలవలేని రామచంద్రయ్యకు తెలుగుదేశం పార్టీలో ఎన్నో అవకాశాలు ఇచ్చారని, అయినా నమ్మకద్రోహానికి పాల్పడ్డారని కూడా ఆయన చెప్పారు. చిరంజీవిని తన చేతుల్లో పెట్టుకుని రామచంద్రయ్య ఆట ఆడిస్తున్నారని కూడా ఆయన కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏమైనా, చిరంజీవి మన్ననలు పొందిన రామచంద్రయ్యకు మంత్రి పదవి దక్కకుండా కడప జిల్లా నాయకులు ఎంత దూరమైనా వెళ్లేట్లున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+