జగన్ తిరుమల దర్శనం: బొంకు బాబు

YS Jagan
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం ఎక్కడా వదిలిపెట్టడం లేదు. వైయస్ జగన్ తిరుమలను ఇప్పటి వరకు సందర్శించలేదని, వైయస్ జగన్ నాస్తికుడని, అలాంటివారికి అధికారం అప్పగిస్తే తిరుపతి, తిరుమల పవిత్రత మంట గలుస్తుందని చంద్రబాబు నాయుడు ఓ పాయింట్ తీశారు. సోనియా గాంధీ అయినా తిరుమల వచ్చారు గానీ కడపలో జగన్ ఏనాడూ తిరుమలకు వచ్చిన దాఖలు లేవని చంద్రబాబు ఓ పాయింట్‌ను లేవనెత్తారు.

చంద్రబాబు ప్రకటనకు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి డైలీ కౌంటర్ ఇచ్చింది. వైయస్ జగన్ శ్రీవారి దర్శనం కోసం క్యూలో నిలబడిన ఫొటోను ప్రచురించి, చంద్రబాబు బొంకుతున్నారంటూ వ్యాఖ్యానించింది. బాబు బొంకు రాజకీయమంటూ శీర్షిక పెట్టి ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది. 2009 ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెసు అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డికి మద్దతుగా ఆ ఏడాది ఏప్రిల్ 17వ తేదీ వైయస్ జగన్ తిరుపతిలో ప్రచారం చేశారని, ఆ రోజు రాత్రి జగన్ తిరుమలలోనే బస చేసి 18వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారని సాక్షి దినపత్రిక రాసింది.

అంతకు ముందు కూడా పలుమార్లు వైయస్ జగన్ శ్రీవారి దర్శనానికి వచ్చారని చెప్పింది. ఎన్నికల నిబంధనావళిని విస్మరించిన చంద్రబాబు మతవిశ్వాసాలపై వ్యాఖ్యానించారని, రాత్రి 10 గంటల తర్వాత రోడ్‌షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారని ఓ రాయి విసిరింది. వైయస్ జగన్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించే క్రమంలో భాగంగానే చంద్రబాబు ఆ వ్యాఖ్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవలి కాలంలో వైయస్ జగన్ మత విశ్వాసం కూడా కాంగ్రెసు పార్టీకి ఎజెండాగా మారింది. దాన్నే చంద్రబాబు పట్టుకుని జగన్ తిరుమల సందర్శనపై వ్యాఖ్యానం చేశారు. వైయస్ జగన్‌ను ఎత్తిచూపడానికి చంద్రబాబు ఏ విధమైన అవకాశాన్ని కూడా వదలిపెట్టడం లేదు. అదే రీతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, సాక్షి మీడియా చంద్రబాబుపై విమర్శల రాళ్లు విసరడంలో దూకుడుగా వ్యవహరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+