వైయస్ విజయమ్మపైకి జయసుధ బాణం?

ఇప్పటికే కాంగ్రెసు, తెలుగుదేశం మహిళా నేతలు వైయస్ విజయమ్మపై వాగ్బాణాలు విసురుతున్నారు. రేణుకా చౌదరి ఇప్పటికే రంగంలోకి దిగారు. ఇంకా మరింత మహిళా నేతలు ముందుకు వచ్చి వైయస్ విజయమ్మను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరితో సమావేశమయ్యారు. ఆ తర్వాత రేణుకా చౌదరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైయస్ విజయమ్మపై విరుచుకుపడ్డారు.
గాంధారిలా వైయస్ విజయమ్మ వ్యవహరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వచ్చే నెల 1వ తేదీ నుంచి రంగంలోకి వస్తారని అంటున్నారు. వైయస్ విజయమ్మను ఎదుర్కోవడానికి మహిళా నేతలే సరి అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భావించినట్లు తెలుస్తోంది. పురంధేశ్వరి వచ్చే నెల 1వ తేదీ నుంచి ఉప ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు.
వైయస్ విజయమ్మ కుమారుడు వైయస్ జగన్ స్థానంలో ఉప ప్రచారంలోకి దిగడంతో మహిళా నేతలను పెద్ద యెత్తున తెలుగుదేశం పార్టీ కూడా రంగంలోకి దింపే ప్రయత్నంలో ఉంది. ముఖ్యమంత్రి పరిటాల రవి సతీమణి పరిటాల సునీతను ఎన్నికల ప్రచారంలోకి దింపే యోచనలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. విజయమ్మ తల్లి బాధ్యతను సరిగా నిర్వర్తించలేదనేది వారి ప్రధాన ఆరోపణగా ముందుకు వస్తోంది.












Click it and Unblock the Notifications