లక్ష్మినారాయణ కాల్ డేటా: ఎస్పీ కాదా, డిటెక్టివ్‌నా?

నాందేడ్ ఎస్పీ పాత్ర ఉన్నట్లు ఏ విధమైన ఆధారాలు లభించలేదని సిఐడి పోలీసు డైరెక్టర్ జనరల్ ఎస్ గోపాల్ రెడ్డి చెప్పినట్లు ఓ ప్రముఖ ఆంగ్లదినపత్రిక రాసింది. లక్ష్మినారాయణ కాల్ డేటా వివరాల కోసం నాందేడ్ ఎస్పీ రిక్వెస్ట్ పంపినట్లు ఆధారాలు లేవని, అయితే ఈ విషయంపై చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. కావాలనే ఎస్పీ పాత్రను రహస్యంగా ఉంచుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఎస్పీ స్థాయి అధికారికి కాల్ డేటా రికార్డు వివరాల కోసం రిక్వెస్ట్ పెట్టే అధికారం ఉంటుంది కాబట్టే దాన్ని రహస్యంగా ఉంచుతున్నట్లు ఒక వైపు నుంచి విమర్శలు వస్తున్నాయి. కాగా, లక్ష్మినారాయణ కాల్ డేటా లీకుపై దర్యాప్తు ఏ మేరకు ముందుకు సాగిందనే విషయాలు కూడా బయటకు రావడం లేదు.
కోర్టులో కేసు దాఖలు చేయడానికి వ్యాపారవేత్త రఘురామ రాజు లక్ష్మినారాయణ కాల్ డేటా రికార్డులను పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ద్వారానే ఆ వివరాలు ఓ టీవీ చానెల్‌కు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు అందినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications