ప్రసాద్ పేరుకు, అరెస్టులకు లింక్

ప్రసాద్ పేరుకూ.. జైలుకూ ఏదో అవినాభావ సంబంధం ఉందన్నదనే మాట చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మార్, జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటివరకు ముగ్గురు ప్రసాద్‌లు అరెస్టయ్యారు. ఇప్పటికే కోనేరు ప్రసాద్, బిబు ప్రసాద్ ఆచార్య జైల్లో ఉండగా, తాజాగా నిమ్మగడ్డ ప్రసాద్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది.
కోనేరు ప్రసాద్ ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో, బిబూ ప్రసాద్ ఆచార్య గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో కేసులో అరెస్టు కాగా, నిమ్మగడ్డ ప్రసాద్ వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. ఐఎఎస్ అధికారి అయిన బిబూ ప్రసాద్ ఆచార్య ఉరఫ్ బిపి ఆచార్యకు వైయస్ జగన్ ఆస్తుల కేసుతోనూ సంబంధం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ ఆస్తుల కేసులోనూ సిబిఐ అధికారులు ఆచార్యను విచారించారు.
అదే సమయంలో పేరు ఎస్ ఆక్షరాన్ని కూడా అదే రీతిలో చూస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన శ్రీలక్ష్మి పేరులో ఎస్ ఉంది. అలాగే, వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన విజయ సాయి రెడ్డి పేరులో కూడా ఎస్ ఉండడం గమనార్హం. గాలి జనార్దన్ రెడ్డి కేసులో అరెస్టయిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి పేరులో కూడా ఎస్ ఉంది.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications