వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ నో ప్రామీస్: మద్దాలి రాజేష్ డ్రామా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Maddala Rajesh
హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి కాంగ్రెసు శానససభ్యుడు మద్దాల రాజేష్ నాటకమాడుతున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆయన రాజీనామా తీరు పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ వర్గాల్లో ఆయన రాజీనామా వ్యవహారంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెసు పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆయన ఇటీవల చేరిపోయారు.

అయితే, ఆయన తన రాజీనామా లేఖలను స్పీకర్ ఫార్మాట్‌లో ఇవ్వలేదని అంటున్నారు. అది తెలియకపోవడం వల్ల జరిగిన పొరపాటు కాదని అంటున్నారు. కావాలనే, తన రాజీనామా ఆమోదం పొందకుండా ఉండడానికే ఆయన ఆ రకంగా చేశారట. ఇంతకీ ఆయన ఎందుకలా చేశారనేది ప్రశ్న. ఆయన వైయస్ జగన్‌ను కలిసి, ఆ తర్వాత పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు చేరారు.

కానీ, చింతలపూడి టికెట్ తనకు ఇస్తానని వైయస్ జగన్ రాజేష్‌కు హామీ ఇవ్వలేదని అంటున్నారు. పార్టీలో చేరిన తర్వాత చూద్దామని ఆయన అన్నారట. దీంతో వెనక్కి తగ్గడం ఆ పరిస్థితిలో ఇష్టం లేక, శాసనసభ స్పీకర్‌కు రాజీనామా సమర్పించారు. కానీ, అది ఆమోదం పొందే స్థితిలో లేదని అంటున్నారు.

తాను మాజీనైన తర్వాత టికెట్ రాకపోతే సమస్య వస్తుందని రాజేష్ కుమార్ భావించినట్లు చెబుతున్నారు. ఏమైనా, తెలివి అంటే రాజేష్ కుమార్‌దే అనే మాట వినిపిస్తోంది.

English summary

 Buz is that - West Godavari district Chandthalapudi MLA Maddala Rajesh kumar, who joined in YS Jagan's YSR Congress party, recently has not submitted his resignation to speaker in correct format.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X