చంద్రబాబు చాణక్యం, ఆమోదించి తిరగ్గొట్టారు

Chandrababu Naidu
సమాచార కమిషనర్ల నియామకం విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారనే మాట వినిపిస్తోంది. సమాచార కమిషనర్ల నియామకం కోసం జరిగిన సమావేశంలో ఆయన విచిత్రంగా ప్రభుత్వానికి ఓటేశారు. పైగా, ఎనిమిది మంది సమాచార కమిషనర్లలో ఆయన సూచించిన ఇద్దరున్నారు. అయితే, ఆ తర్వాత ఆయన యూ టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రభుత్వ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సమాచార కమిషనర్లలో చాలా మంది ఏదో రాజకీయ పార్టీకి చెందినవారే ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ స్థితిలో చంద్రబాబు సమాచార కమిషనర్ల నియామకంపై ఆమోదం ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు.

చంద్రబాబు సమాచార కమిషనర్ల నియామకానికి ముందు అంగీకరించి, ఆ తర్వాత తిరగ్గొట్టడం వెనక రాజకీయ చాణక్యం ఉందని అంటున్నారు. కానీ, చంద్రబాబు అడుగు వెనకేయడం రాజకీయ చాణక్యమేమీ కాదని, అందులో మరో మతలబు ఉందని అంటున్నారు. ఆ మతలబు ఏమిటా అని ఆరా తీస్తే - సమాచార కమిషనర్ల నియామకానికి వ్యతిరేకంగా మర్నాడే రామోజీరావుకు చెందిన ఈనాడు దినపత్రికలో ఓ వార్తాకథనం వచ్చింది. అన్నీ రాజకీయ నియామకాలేనని విమర్శిస్తూ ఆ వార్తాకథనం ప్రచురితమైంది. దీనివల్లనే చంద్రబాబు వెనక్కి తగ్గి ఏమీ చెప్పకుండా దాటేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+