జగన్ స్థితికి మన్మోహన్ చలించిపోయారా?

విజయమ్మతో పాటు మన్మోహన్ సింగ్‌ను కలిసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రధాని వద్ద జరిగిన విషయాలపై రాజమోహన్ రెడ్డి ఓ ఆంగ్లదినపత్రికతో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఎదుర్కుంటున్న పరిస్థితులకు తాను చాలా చింతిస్తున్నానని మన్మోహన్ అన్నారట.
శుక్రవారంనాడు వైయస్ విజయమ్మ అధ్యక్షతను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమావేశం జరిగింది. వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై సిబిఐ జెడి లక్ష్మినారాయణ సమర్పించిన నివేదికను సమావేశం తిరస్కరించింది. వైయస్ మృతిపై తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. లక్ష్మినారాయణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన పోరును కొనసాగించాలనే నిర్ణయించినట్లు దీన్ని బట్టి తెలుస్తోంది.
సిబిఐ జెడి లక్ష్మినారాయణ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, వైయస్ జగన్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వైయస్ విజయమ్మ ప్రధానికి ఫిర్యాదు చేశారు. ఒక వర్గం మీడియాకు లక్ష్మినారాయణ సమాచారం లీకు చేస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications