బాలయ్యకున్న విశ్వసనీయత బాబుకు లేదా?

Balakrishna
హైదరాబాద్: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రకటనలు చేసినా తెలంగాణ ప్రాంతంలో ఫలితం కనిపించలేదు. అయితే, నందమూరి బాలకృష్ణ తెలంగాణపై ఒక్క ప్రకటన చేయడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో పార్టీలో కదలిక ప్రారంభమైంది. తెలంగాణపై స్పష్టతకు వచ్చి, ప్రకటన చేసేందుకు చంద్రబాబు సెప్టెంబర్ మొదటివారంలో సిద్ధపడుతున్నారని వార్తలు రావడం, బాలయ్య ప్రకటన చేయడం కలిసి వచ్చిందని అంటున్నారు.

అంటే, బాలయ్యకు ఉన్న విశ్వసనీయత చంద్రబాబు లేదా అనే ప్రశ్న ఉదయిస్తోంది. తెలంగాణపై శాసనసభలో తీర్మానం ప్రవేశపెడితే మద్దతిస్తామని ప్రకటన చేసిన చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే వెనక్కి తగ్దారు. దీంతో చంద్రబాబు ప్రకటనలపై ఒక రకంగా తెలంగాణ ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లిందని చెప్పవచ్చు. పార్టీని బలోపేతం చేసుకోవడానికి మాత్రమే చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారని అభిప్రాయం తెలంగాణలో బలపడిపోయింది.

బాలయ్య ప్రకటన వెలువడడంతో చంద్రబాబు మాటల్లో వాస్తవం ఉందనే భావన కొంత మేరకు బలపడిందని చెప్పాలి. పైగా, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ సమైక్యాంధ్రకు కట్టుబడడంతో బాలకృష్ణ కూడా అదే వైఖరి ప్రదర్శిస్తారని, జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుజాతి అంటూ సమైక్యాంధ్ర నినాదాన్నే వినిపిస్తారని అనుకుంటూ వస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించనప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాల కోసం తప్ప చిత్తశుద్ధితో తెలంగాణ కోసం ముందుకు రాదనే అభిప్రాయం నాటుకుపోయి ఉంది.

బాలకృష్ణ ప్రకటన వెలువడడంతో నిజంగానే పార్టీపరంగా చిత్తశుద్ధితో చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే భావనకు ఊపిరిపోసింది. సీమాంధ్ర నాయకులు తర్వాత కూడా అడ్డుచెప్పరనే అభిప్రాయం బాలయ్య ప్రకటన వల్ల బలపడింది. సీమాంధ్ర నాయకులు సమైక్యనాదం వినిపిస్తూ ఇక్కడ తెలంగాణ అని చంద్రబాబు అన్నా, మరెవరు అన్నా పార్టీకి ప్రయోజనం చేకూరే పరిస్థితి లేదు. బాలయ్య ప్రకటన తర్వాత కూడా సీమాంధ్ర నాయకులు మాట్లాడకపోవడంతో చంద్రబాబు విశ్వసనీయత మీద కాస్తా నమ్మకం ఏర్పడినట్లు చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+